Sanjay Raut : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి నెల దాటినా ఇంతవరకు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోకపోవడంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆ ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారంటే వాళ్లు బీజేపీలో చేరవచ్చునని వ్యాఖ్యానించారు.
ఏదో ఒక రోజు బీజేపీ ఆరుగురు వ్యక్తులను బీజేపీలో చేర్చుకుంటున్నట్లు పత్రికా ప్రకటన చేస్తుందని రౌత్ ఆరోపించారు. అయితే రౌత్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆయనను పిచ్చాస్పత్రిలో చేర్చాలని వ్యాఖ్యానించింది. అటు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేతలు కూడా సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాళ్లను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడంలేదనే అక్కసుతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది.