ఇస్లామాబాద్: బాల్య వివాహాలను(Child Marriage) రద్దు చేస్తూ రూపొందించిన బిల్లుకు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పచ్చజెండా ఊపారు. ఆ బిల్లుపై ఆయన సంతకం చేశారు. పిల్లల హక్కులను రక్షిస్తూ, 18 ఏళ్ల లోపు చిన్నారుల పెళ్లిని రద్దు చేస్తూ బిల్లును రూపొందించారు. మే 27వ తేదీ ఆ బిల్లు అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి చేరింది. పార్లమెంట్ ఉభయసభల నుంచి ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. బాల్య వివాహాల రద్దు బిల్లును మత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) పేర్కొన్నది. 18 ఏళ్ల లోపు పెళ్లిని అత్యాచారంగా భావించడం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకమని సీఐఐ తెలిపింది. బాల్య వివాహాల రద్దు బిల్లుకు చెందిన నోటీఫికేషన్ను అధ్యక్షుడి భవనం రిలీజ్ చేసింది.
Read More