NEET-PG 2025 | నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
NEET-PG 2025 | దేశ వ్యాప్తంగా జూన్ 15న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను రెండు షిఫ్టులకు బదులుగా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. పూర్తి పారదర్శకత ఉండేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జూన్ 15న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) 2025 పరీక్షను రెండు షిఫ్టులకు బదులుగా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఒకే షిఫ్టులో పరీక్షను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని, పూర్తి పారదర్శకత ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాగా, నీట్ పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించే నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, ఎన్వీ అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది.
మరోవైపు నీట్ పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించడం ‘ఏకపక్షపాతాన్ని’ సృష్టిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ‘ఏ రెండు ప్రశ్నపత్రాలు ఒకే స్థాయిలో కష్టంగా లేదా సులభంగా ఉంటాయని ఎప్పుడూ చెప్పలేం’ అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:
14 ఏళ్ల ఐపీఎల్ స్టార్‌ను కలిసిన ప్రధాని మోదీ
బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్నాయి.. మోదీని టార్గెట్ చేసిన ఖర్గే
ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలను పోషించేందుకు.. దొంగగా మారిన వ్యక్తి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- conducted
- directs
- exam
- NEET PG 2025
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

