Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ఇప్పటికే అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ప్రయాణికుల మధ్య ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
సీటు కోసం ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి, పలువురు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. సదరు వ్యక్తి మహిళలకు సీటు నిరాకరించడంతో చర్చకు దారితీసింది. పదేపదే రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యక్తి తన సీటును వదులుకోలేదు. దీంతో ఆ వ్యక్తిని రైలు కోచ్‌లోని మహిళలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Waqf Bill | లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ బిల్లు.. 8 గంటల పాటూ జరగనున్న చర్చ
MK Stalin | డీలిమిటేషన్ సెగ.. ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ