Artificial Rain | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11 మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) చూసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నుంచి అనుమతి పొందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కృత్రిమ వర్షంకు దాదాపు రూ.3.21 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
కృత్రిమ వర్షం అంటే..?
కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెదర్లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్ధాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది.
Also Read..
Char Dham Yatra | చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత
కుట్ర కోణంపైనా దర్యాప్తు ఎయిరిండియా ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి
రథయాత్రలో తొక్కిసలాట.. పూరీలోని గుడించా గుడి వద్ద ఘటన.. ముగ్గురి మృతి