మహిళలకు నెలకు రూ. 1000 భృతి ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి అందచేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీ : ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి అందచేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఆర్ధిక మంత్రి అతిషి రూ. 76,000 కోట్ల బడ్జెట్‌ను సోమవారం సభలో సమర్పించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవ బడ్జెట్ కావడం విశేషం.
గతంలో విద్యపై వెచ్చించేందుకు ఆదాయం లేకపోవడంతో ఢిల్లీ వాసులు తమ కొడుకులను ప్రైవేట్ స్కూల్స్‌కు, కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారని బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మంత్రి అతిషి తెలిపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే బాలికలు ఐఐటీ, నీట్ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. దీంతో గతంలో డబ్బున్న కుటుంబాల పిల్లలు సంపన్నులుగా, పేదల పిల్లలు పేదవారిగా కొనసాగుతారనే నానుడి మారిన పరిస్ధితి నెలకొందన్నారు.
2015 నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం 22,711 నూతన తరగతి గదులను నిర్మించిందని చెప్పారు. విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ ఏడాది విద్యకు రూ. 16,396 కోట్లు కేటాయించామని తెలిపారు. హనుమంతుడు సంజీవనితో లక్ష్మణుడిని కాపాడిన విధంగా సత్యేందర్ జైన్ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధను పునరుద్ధరించారని ఆమె తెలిపారు.
Read More :
Arvind Kejriwal | ఈడీ విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Announces
- Cash
- Delhi
- Government
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

