Poster Release | హనుమకొండ చౌరస్తా: జనసేన (Janasena) పార్టీ జిల్లా ముఖ్య నాయకులు గాదె పృథ్వీ, పద్మజాదేవి, గడ్డం రాకేష్ మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ నెల 22న హనుమకొండ కేంద్రంగా జరగనున్న ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల జనసైనికులతో హనుమకొండ కేంద్రంగా ఈనెల 22 శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో వరంగల్ జిల్లా సమస్యలపై జనసేన పోరాటం చేసిందని, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ ప్రజాసమస్యలపై మరింత చురుగ్గా పోరాడుతామన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక జనసైనికుడు హాజరై విజవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నేతలు అమంచ సునీల్, శివకోటి, రవితేజ, మెడిద ప్రశాంత్‌రెడ్డి, అనుదీప్, బర్ల శివ, బయ్య పద్మావతి, నాగమణి, ఫరీద్, డేవిడ్, రంజిత్, బండి నాగరాజు, మధుసూదన్, నాగేంద్ర పాల్గొన్నారు.