Cricket Australia : సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమితో ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) మేల్కొంది. ప్రపంచ నంబర్ 1 జట్టైన తమను బంగ్లా 9 వికెట్లతో చిత్తు చేయడాన్ని నమ్మలేకపోతున్న ఆసీస్ సెలెక్టర్లు.. రెండో టెస్టుకు కీలక మార్పు చేశారు. ఓపెనర్‌గా విఫలమవుతున్న జేక్ వెథెరాల్డ్పై వేటు వేసి.. మాథ్యూ రెన్షా(Mathew Renshaw)ను తీసుకున్నారు. దాంతో, మూడేళ్ల తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండర్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. మూడో స్థానంలో నిరాశపరుస్తున్న మార్నస్ లబూషేన్‌కు మరో అవకాశం ఇచ్చారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC)లో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కూర్చుకున్న ఆస్ట్రేలియా… స్వదేశంలో బంగ్లాదేశ్ ఇచ్చిన షాక్‌తో మార్పులకు శ్రీకారం చుట్టింది. డార్విన్ టెస్టులో 9 వికెట్ల ఓటమికి ప్రతీకారంతో రగిలిపోతున్న కమిన్స్ సేన మెక్‌కేలో జరుగనున్న రెండో టెస్టుకు భారీ మార్పు చేసింది. జేక్ వెథెరాల్డ్ స్థానంలో మాథ్యూ రెన్షా ఓపెనర్‌గా ఎంపిక చేశామని కోచ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. దాంతో, ఇటీవల కాలంలో సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఏడో ఓపెనర్ కానున్నాడు.
Matt Renshaw is set to replace Jake Weatherald as Australia’s opener for the second Test against Bangladesh in Mackay
It means Australia will have used seven openers since David Warner retired in early 2024, outside of Usman Khawaja, who was already established at the top of the… pic.twitter.com/rMOA5Hfyt5
— Cricinfo (@cricinfo) August 18, 2026
డేవిడ్ వార్నర్ వీడ్కోలు అనంతరం.. ఆసీస్ సెలెక్టర్లు పలువురిని పరీక్షించారు. ఉస్మాన్ ఖవాజా జతగా.. హెడ్, స్మిత్, నాతన్ మెక్‌స్వీనే, సామ్ కొన్స్టాన్స్, లబూషేన్ వీరిని ఆడించారు. ఖవాజా రిటైర్మెంట్తో.. హెడ్ ఓపెనర్‌గా స్థిరపడగా అతడికి సరైన జోడీ మాత్రం దొరకడం లేదు. రెండో టెస్టు ఆగస్టు 22న మొదలవ్వనుంది. మరి.. రెన్షా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, లబూషేన్, నాథన్ లియాన్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టెర్.