Meta | పిల్లలపై అభ్యంతరకర వీడియోలు.. చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదు.. మెటాకు కేంద్రం వార్నింగ్
Meta : పిల్లలపై అభ్యంతరకర, లైంగిక వీడియోలు (సీఎస్ఏఎం) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మెటాకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Meta : పిల్లలపై అభ్యంతరకర, లైంగిక వీడియోలు (సీఎస్ఏఎం) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మెటాకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సీఎస్ఏంఎ అంశాన్ని మెటా తీవ్రంగా పరిగణిస్తుందని, తన ప్లాట్‌ఫాంలపై అక్రమ, చట్టవ్యతిరేక కంటెంట్‌ను నియంత్రించడానికి కృషి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇండియాలోని భిన్న భాషలు, సంస్కృతికి అనుగుణంగా కంటెంట్ మోడరేషన్ చేయాలని మెటాకు సూచించింది.
మెటా ప్లాట్‌ఫాంలపై కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను నియంత్రించడంపై కేంద్రానికి, మెటాకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున మెటాకు పలు సూచనలు అందాయి. సీఎస్ఏఎం కంటెంట్‌ను అరికట్టే విషయంలో మెటా బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. చట్ట వ్యతిరేక, అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తించడానికి మెటా మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఒకవేళ సీఎస్ఏఎం విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పించే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ కోల్పోతారు. దేశంలోని చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది కేంద్రం. అంతర్జాతీయ ప్రమాణాల్ని ఇండియాలో తగ్గించాల్సిన అవసరం లేదు. అలాగే, భాష, సాంస్కృతికపరమైన సున్నితమైన అంశాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు తమ వ్యవస్థల్ని మార్చుకోవాలి.
కేంద్రం ఈ అంశాల్ని మెటా, వాట్సాప్ వంటి వాటికి పరిమితం చేయడం లేదు. అన్ని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లకు వర్తించేలా చూస్తుంది. ఇటీవల వాట్సాప్ తీసుకురావాలని భావించిన యూజర్ నేమ్ విషయంలో కూడా కేంద్రం కఠినంగానే వ్యవహరించింది. వాట్సాప్ చేపట్టనున్న ఇతర అప్డేట్లపై కూడా కేంద్రం దృష్టి సారించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వస్తున్న ఏఐ కంటెంట్‌పై కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కంటెంట్ ఏఐతో రూపొందించిందా లేదా తెలుసుకునేందుకు వీలుగా ఆ ఫొటోలు, వీడియోలపై లేబుల్ ఉండేలా చూడాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

