Delhi Fire Services | వేసవి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అగ్నిప్రమాద ఘటనలే. ఇక దేశ రాజధానిలో అయితే చెప్పనవసరం లేదు. కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు ఇలా ఒకటేంటి ఎక్కడ చూసినా నిత్యం అగ్ని ప్రమాద ఘటనలే కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా ఢిల్లీలో వరుస ఫైర్ ఇన్సిడెంట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ (Delhi Fire Services) వెల్లడించిన డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,991 అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే రోజూ సగటున 200 కాల్స్ (fire-related calls) వచ్చినట్లు. ఇక గతేడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ అని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గతేడాది వేసవిలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు రోజుకు దాదాపు 160 కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక చలికాలంలో ఈ సంఖ్య 70 నుంచి 80 వరకూ మాత్రమే ఉంటుందని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి (Intense Heatwave). రాజధాని ప్రాంతంలో ఏకంగా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అగ్నిప్రమాదాలు కూడా పెరిగాయి. గత రెండు వారాలుగా ఢిల్లీ తీవ్ర వేడిగాలులతో అల్లాడుతోంది. దీంతో నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కింగ్ స్థలాల్లో అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. సరైన నిర్వహణ లేకుండా ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) యూనిట్లను ఎక్కువగా వినియోగించడమే అగ్నిప్రమాదాల పెరుగుదలకు కారణమని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ (Atul Garg) తెలిపారు.
Also Read..
Bibhav Kumar | స్వాతి మలివాల్ కేసు.. తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేసిన బిభవ్ కుమార్
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేసే అవకాశం..!