Bibhav Kumar | స్వాతి మలివాల్ కేసు.. తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేసిన బిభవ్ కుమార్
Bibhav Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ (Bibhav Kumar) తాజాగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు.
Bibhav Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ (Bibhav Kumar) తాజాగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. దాడి కేసులో తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
కాగా, ఈ బిభవ్కుమార్కు దిగువ కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గౌరవ్ గోయల్.. బిభవ్కుమార్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన తాజాగా తన అరెస్ట్‌ను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.
కాగా, ఇటీవల కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆప్ ఎంపీ స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బిభవ్‌ను ఈ నెల 18 అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ముందుగా ఐదు రోజుల పోలీస్ కస్టడీ, తర్వాత నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ, మళ్లీ మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Also Read..
Cinema Lovers Day | సినీలవర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేసే అవకాశం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

