Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ షాక్ తగిలింది.
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ షాక్ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) కేజ్రీ పిటిషన్ వేసిన (bail extension plea) విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు రిజిస్ట్రీ తెలిపింది.
అంతకుముందు కేజ్రీ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను ఎప్పుడు విచారించాలన్న అంశంపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ మంగళవారం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను మధ్యంతర బెయిల్‌ను విచారిస్తున్న బెంచ్ ఉన్నప్పుడు గతవారమే ఎందుకు దాఖలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Also Read..
Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేసే అవకాశం..!
Virat Kohli | అనుష్కతో కలిసి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ.. పిక్స్ వైరల్
Burj Khalifa | ఊదా రంగులోకి మారిపోయిన బుర్జ్ ఖలీఫా.. కేకేఆర్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

