Burj Khalifa | ఊదా రంగులోకి మారిపోయిన బుర్జ్ ఖలీఫా.. కేకేఆర్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు
Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa). ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక థీమ్‌ను ప్రదర్శిస్తుంది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)కు బుర్జ్ ఖలీఫా స్పెషల్‌గా కంగ్రాట్స్ చెప్పింది.
Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa). ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక థీమ్‌ను ప్రదర్శిస్తుంది. తాజాగా ఆదివారం ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు బుర్జ్ ఖలీఫా స్పెషల్‌గా కంగ్రాట్స్ చెప్పింది.
కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చిత్రం, జట్టు సభ్యుల చిత్రాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎత్తైన కట్టడాన్ని మొత్తం ఊదా రంగుతో నింపేసి ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక థీమ్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేకేఆర్ టీమ్‌కు, షారుఖ్‌కు ప్రత్యేకంగా అభినందనలు అంటూ ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ టీమ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ‘షారుఖ్ పవర్ అంటే ఇదీ..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండు నెలలుగా క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఈ సీజన్లో పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఐపీఎల్లో విజేతగా (IPL Title) నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (Sunrisers Hyderabad) చిత్తుచిత్తుగా ఓడించి ఈ లీగ్‌లో మూడోసారి కప్పు కొట్టింది. తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. సరిగ్గా పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
Also Read..
Israel attacks | ఆ దృశ్యాలు కలచి వేస్తున్నాయి.. రఫాలో ఇజ్రాయెల్ దాడులను ఖండించిన అమెరికా
Tamil Nadu Doctors | పొరపాటున సూది మింగిన బాలిక.. సర్జరీ లేకుండా రికార్డు టైమ్‌లో తొలగించిన వైద్యులు
Viral news | యువకుడి కడుపులో ఇనుప మేకులు, నట్లు, బోల్టులు.. అవాక్కైన వైద్యులు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

