Prajwal Revanna | కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో (Karnataka Sex Scandal Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) రేపు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే మే 31న తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని ఇటీవల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే మే 30న జర్మనీలోని మ్యూనిచ్ నుంచి అతడు భారత్‌కు బయల్దేరనున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. మే 31న ఉదయం 10 గంటలకు అతడు సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ప్రజ్వల్ కోసం నిఘా పెట్టింది. విమానాశ్రయంలో ప్రజ్వల్ ల్యాండ్ కాగానే అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Tamil Nadu Doctors | పొరపాటున సూది మింగిన బాలిక.. సర్జరీ లేకుండా రికార్డు టైమ్‌లో తొలగించిన వైద్యులు
Virat Kohli | అనుష్కతో కలిసి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ.. పిక్స్ వైరల్
Burj Khalifa | ఊదా రంగులోకి మారిపోయిన బుర్జ్ ఖలీఫా.. కేకేఆర్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు