Delhi Elections | వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. సమావేశం అయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఇక ఈ ఎన్నికల కోసం అధికార ఆప్ (Aam Aadmi Party) తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా ముఖ్యమంత్రి అతిశీ గతంలో పోటీ చేసిన కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు.
Also Read..
Jamili Elections | లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
BJP chief | వచ్చే ఏడాది బీజేపీకి కొత్త అధ్యక్షుడు..! ఎవరికి అవకాశం కల్పిస్తారో..?
ONOE Bill: జమిలి బిల్లుకు టీడీపీ మద్దతు.. జేపీసికి పంపుతామన్న అమిత్ షా