BJP chief | వచ్చే ఏడాది బీజేపీకి కొత్త అధ్యక్షుడు..! ఎవరికి అవకాశం కల్పిస్తారో..?
BJP chief | కొత్త ఏడాదిలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిని (BJP chief) ఎన్నుకోనున్నట్లు తెలిసింది.
BJP chief | కొత్త ఏడాదిలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిని (BJP chief) ఎన్నుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ ఎంపిక ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా పూర్తి అవుతుందని పేర్కొన్నాయి.
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని (BJP national president) ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా (JP Nadda) ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటీవలే కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.
బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు?
మరోవైపు తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వారిలోనే ఒకరికి జాతీయాధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా..? లేక కొత్త వారిని తీసుకుంటారా..? అనే విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రేసులో పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రేసులో ప్రధానంగా వినిస్తున్నది. బీఎల్ సంతోష్ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా తావ్డేకు పేరున్నది. అలాగే తెలంగాణకు చెందిన కే లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. రేసులో సునీల్ బన్సల్ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ర్టాల ఇన్చార్జిగా ఉన్నారు. ఎంపీ ఓం మాథుర్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. మరోవైపు, పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నియమితులయ్యే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read..
Jamili Elections | లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
Priyanka Gandhi | నిన్న పాలస్తీనా.. నేడు బంగ్లాదేశ్ బ్యాగ్.. వినూత్న రీతిలో ప్రియాంక గాంధీ నిరసన
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. వారంలో నాలుగోసారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

