Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటనలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకూ వందలాది విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీకి వెళ్తున్న ఓ రైలుకు (Delhi bound train) బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
శుక్రవారం సాయంత్రం సమయంలో 12565 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (Sampark Kranti Express train).. బీహార్ (Bihar)లోని దర్భంగా (Darbhanga) నుంచి న్యూఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వచ్చింది. దీంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సహా భద్రతా బలగాలు అప్రమత్తమై రైలును సాయంత్రం 7:30 గంటల సమయంలో యూపీలోని గోండా రైల్వే జంక్షన్ వద్ద ఆపివేశారు.
అనంతరం రైల్లో బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ లభించలేదని సంబంధిత అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు బూటకమని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనిఖీల అనంతరం రైలును తన గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ ఘటనతో ప్రయాణికులు, రైల్వే అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Diwali tradition | ఆ ఊళ్లో దీపావళి మరుసటి రోజు ఆవులతో తొక్కించుకుంటారు.. Video
Shashi Tharoor: కులం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంపీ శశిథరూర్