Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలోని ఓ ఆసుపత్రిలో దీపికా ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తాజాగా తమ గారాల పట్టికి దీపిక-రణ్వీర్ దంపతులు నామకరణం చేశారు. పాపకు దువా పదుకొణె సింగ్ (Dua Padukone Singh) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్టార్ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
‘‘దువా’ అంటే ప్రార్థన. మా ప్రేయర్స్కు సమాధానమే ఆమె. ఇప్పుడు మా హృదయాలు ప్రేమతో నిండిపోయి ఉన్నాయి’ అంటూ వెల్లడించారు. ఈ మేరకు చిన్నారి కాళ్లను ఫొటో తీసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇది చూసిన పలువురు బీటౌన్ తారలు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘రామ్ లీలా’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రామ్ లీలా తర్వాత, బాజీరావు మస్తానీ (Bajirao Mastani), పద్మావత్ (Padmaavat) సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలకు కూడా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడం విశేషం.
Also Read..
Rashmika Mandana | విజయ్ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్..! ఫొటోలు చూశారా..?