Rashmika Mandana | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandana) జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ జంట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో వీరిద్దరూ మళ్లీ కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. వీళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అయితే అన్స్క్రీన్లో లానే ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని అభిమానులు ఎప్పుడూ చర్చించుకుంటుంటారు.
గత కొంతకాలంగా వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, అవి రూమర్స్ మాత్రమే అని ఇద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ, ఆ ప్రచారానికి మాత్రం తెరపడట్లేదు. దీనికి తోడు.. ఇద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్గా వెలుగుల పండుగ దీపావళి వేడుకలను (Diwali Celebrations) విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలకు రష్మిక వచ్చినట్లు తెలుస్తోంది.
దివాళీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని సోలో ఫొటోలను రష్మిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో ఈ కన్నడ సోయగం మెరిసిపోతూ కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ‘దీపావళి ఫోటోషూట్ డన్..! దీపావళి శుభాకాంక్షలు మై లవ్లీస్’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే, కింద కామెంట్ సెక్షన్లో ‘ఫొటో క్రెడిట్: ఆనంద్ దేవరకొండ (ananddeverakonda).. థ్యాంక్యూ ఆనంద్’ అంటూ పేర్కొంది. దీంతో విజయ్ ఫ్యామిలీతో దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు విజయ్ దేవరకొండ సైతం తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక పోస్ట్‌తో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.
Also Read..
Advance Booking | రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
Chenab Bridge | చీనాబ్ బ్రిడ్జ్‌పై కన్నేసిన పాక్.. చైనా కోరిక మేరకు సమాచార సేకరణ
Apple CEO | రికార్డు స్థాయిలో ఆదాయం.. భారత్‌లో యాపిల్ మరో నాలుగు స్టోర్లు : టిమ్ కుక్