Air India | టాటా గ్రూప్ ఆధీనంలోని దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు (technical issue) కొనసాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియాలోని వియన్నా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండిమా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని దుబాయ్ (Dubai)కి దారిమళ్లించారు. తనిఖీల అనంతరం దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ధృవీకరించింది.
‘అక్టోబర్ 9న వియన్నా (Vienna) నుంచి న్యూఢిల్లీకి బయల్దేరిన AI-154 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని దుబాయ్‌కి దారి మళ్లించాం. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అవసరమైన తనిఖీల అనంతరం విమానం ఇవాళ ఉదయం 8:45 గంటలకు న్యూఢిల్లీకి బయల్దేరింది’ అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అనుకోని ఈ ఘటనతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పింది.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్
Karwa Chauth | కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం.. కర్వాచౌత్ విశేషాలు..
ఆర్టీఐ నిర్వీర్యం!.. నత్తను మరిపిస్తున్న సమాచార కమిషన్లు