Zubeen Garg | అస్సాం గాయకుడు (Assamese music legend) జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు జుబీన్ మృతిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే జుబీన్ మేనేజర్ సిద్ధార్థశర్మ, నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్ కజిన్ సోదరుడు సహా పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జుబీన్ గార్గ్ ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని (Personal Security Officers) సిట్ బృందం అరెస్ట్ చేసింది. నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యాలను రోజులుగా ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
గార్గ్ మృతిపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం.. గాయకుడి ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. వారి ఖాతాల్లో దాదాపు రూ.కోటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో గార్గ్ మరణంలో వారి ప్రమేయం ఉందనే అనుమానంతో వారిని విచారించారు. అనంతరం నేడు అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
ఆర్టీఐ నిర్వీర్యం!.. నత్తను మరిపిస్తున్న సమాచార కమిషన్లు
నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలు?.. కూటముల మార్పుతో దెబ్బతిన్న విశ్వసనీయత!
బాల్యం నుంచే లైంగిక విద్య.. 9, 10 తరగతులకే పరిమితం కారాదు: సుప్రీంకోర్టు సూచన