న్యూఢిల్లీ, అక్టోబర్ 9: లైంగిక విద్యను 9, 10వ తరగతిలో కాకుండా బాల్య దశ నుంచే పాఠశాల సిలబస్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. లైంగికదాడికి పాల్పడిన ఓ బాలనేరస్థుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.కౌమార ప్రాయంలో శారీరకంగా జరిగే మార్పులు, పర్యవసానాలను విద్యార్థులకు తెలియచేస్తున్నదీ లేనిదీ ప్రభుత్వం నుంచి కోర్టు తెలుసుకోగోరింది.
కోర్టు ఆదేశాల మేరకు అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 9, 10వ తరగతుల నుంచి సిలబస్‌లో లైంగిక విద్యను చేర్చినట్లు తెలిపింది. ఈ సిలబస్‌పై సంతృప్తి చెందని సుప్రీంకోర్టు లైంగిక విద్య ను 9, 10వ తరగతులకు మాత్రమే పరిమితం చేయకుండా బాల్యం నుంచి పాఠశాల విద్యార్థులకు బోధించాలని అభిప్రాయపడింది.