న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కరోనా ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వం కూడా ఆస్పత్రుల్లో వసతులు, వైరస్ కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నది. దీంతో గత ఏడాదిలాగే ఈసారి కూడా చెప్పాపెట్టకుండా లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం నేపథ్యంలో వలస కార్మికులు ముందే జాగ్రత్త పడుతున్నారు. తట్టాబుట్టా సదురుకుని స్వస్థలాలకు తిరుగుపయనం అవుతున్నారు. ఈ కింది చిత్రాల్లో ఐఎస్బీటీ, ఆనంద్ విహార్ ప్రాంతాలకు చెందిన వలసకార్మికులు తిరిగి వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు.
Delhi: Amid rising cases of COVID-19, migrant workers start returning to their native places; visuals from ISBT, Anand Vihar.
— ANI (@ANI) April 13, 2021
"The rate at which the cases are rising makes it obvious that lockdown would be imposed. That is why I am going home," a labourer said yesterday. pic.twitter.com/8D2kfxQcfN
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!