Wayanad | కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. 32 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అందజేశారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. ఇక ఈ ఘటనలో 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు (Rescue op Continue).
Based on inputs from Kerala Govt. Forest Officials & Villagers, 122 Inf Battalion (TA) Madras, led by Sub Gijil, Sub Jayesh & Nb Sub Anilkumar along with 12 Jawans, rescued 19 civilians stranded in ElaResort & VanaRaniResort beyond Mundkayi village: Defence PRO for Kerala
(Pics:… pic.twitter.com/KFnhxzRKy6
— ANI (@ANI) July 31, 2024
కారు ప్రమాదానికి గురైన మంత్రి వీణా జార్జ్..
కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)కు ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి
మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి జార్జి కురియన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, ఇతర పరిస్థితులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు.
Kerala | Wayanad Landslide | Union Minister George Kurien took stock of the area where landslides occurred yesterday and met the victims at the relief camps pic.twitter.com/W4HpAsNQiV
— ANI (@ANI) July 31, 2024
దేవభూమిలో ఊహకందని విషాదం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
కేరళలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పడి, చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మూడుసార్లు కొండచరియలు తెగిపడ్డాయి. దీంతో వందలాది ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. చాలా ఇండ్లు వరద, బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడమని హాహాకారాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు, మనుషుల శరీర అవయవాలు చలియార్ నదిలో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది.
Kerala | Wayanad Landslide | Union Minister George Kurien took stock of the area where landslides occurred yesterday and met the victims at the relief camps pic.twitter.com/OvYCTtmaKn
— ANI (@ANI) July 31, 2024
Also Read..
Veena George | కారు ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. వయనాడ్ వెళ్తుండగా ఘటన
Ladakh: వేడెక్కుతున్న లడాఖ్.. వేగంగా కరుగుతున్న గ్లేసియర్స్
Wayanad landslides: 48 గంటల్లో 572 ఎంఎం వర్షపాతం.. వయనాడ్ విలయానికి కారణమిదేనా?