న్యూఢిల్లీ: శీతల ప్రదేశం లడాఖ(Ladakh)లో ప్రస్తుతం వాతావరణం వేడెక్కుతున్నది. దీంతో అక్కడ ఉన్న మంచు పర్వతాలు వేగంగా కరుగుతున్నాయి. లడాఖ్ లాంటి ప్రాంతంలో టెంపరేచర్లు పెరగడం ఆందోళనకరమైన అంశమని భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు. మంచు పర్వతాలు మన సహజ సంపద అని, అవి చాలా విలువైనవని, గ్లేసియర్స్ నుంచే మనకు నీళ్లు వస్తాయని, ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతుంటే, అప్పుడు గ్లేసియర్స్ వేగంగా కరుగుతుంటాయన్నారు. లడాఖ్‌లో 30 డిగ్రీలు అంటే.. మెట్ట ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లే అని, అంత వేడి ఉంటే, అప్పుడు పర్వతాలపై ఉన్న ఐస్ వేగంగా కరిగిపోతుందని సోనమ్ లోటస్ తెలిపారు.
లడాక్ చాలా శీతల ఎడారి ప్రాంతమని, అలాగని ప్రతి సీజన్లో ఇక్కడేమీ కోల్డ్‌గా ఉండదని, డిసెంబర్ నుంచి జనవరి నుంచి వాతావరణం శీతలంగా ఉంటుందని, ఆ సమయంలో లేహ్‌లో మైనస్ 25 వరకు డిగ్రీల వరకు వెళ్తుందన్నారు. జూలై, ఆగస్టు సమయంలో ఇక్కడ సమ్మర్ వాతావరణం ఉంటుందని, ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందని, లడాఖ్‌లో జూలై, ఆగస్టు నెలలు హాటెస్ట్ అని ఐఎండీ డైరెక్టర్ సోనమ్ తెలిపారు. లేహ్‌తో పోలిస్తే కార్గిల్‌లో అదనంగా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతుందన్నారు.
ఈసారి లేహ్‌లో అత్యధికంగా 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జూలై 28వ తేదీన కార్గిల్‌లో అత్యధికంగా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు. జూలై రెండో వారం నుంచి ఆగస్టు మధ్య వరకు, అంటే సుమారు 45 రోజులు వేడి వాతావరణం ఉంటుందన్నారు. వేడి వల్ల కొన్ని సందర్భాల్లో వర్షం కూడా కురుస్తుందన్నారు.
#WATCH | Rising temperature in Ladakh region causes faster melting of glaciers here.
IMD Director Sonam Lotus says, “…Steep rise in temperature, that too in Ladakh, is indeed a matter of concern. Glaciers are our natural resources and are very valuable. We get water from that… pic.twitter.com/OjsqyCIQnG
— ANI (@ANI) July 31, 2024