హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది.
కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.