Veena George | కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)కు ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా వయనాడ్ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి ఇవాళ ఉదయం తన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు వయనాడ్‌లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 150కి చేరుకుంది. ప్రస్తుతం ముండక్కిలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. 143 మందికి అటాప్సీ పూర్తి చేశారు. 20 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ను మంగళవారం రాత్రి నిలిపివేశారు. ఇవాళ ఉదయం మళ్లీ ఆ ఆపరేషన్ మొదలుపెట్టారు.
ఇక ఇప్పటి వరకూ 48 మంది బాధితుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టమ్ అయిన మృతదేహాలకు వాళ్ల బంధువులకు అప్పగించారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Also Read..
Anant Ambani | పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేసిన కొత్త జంట అనంత్ అంబానీ – రాధికా మర్చంట్
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్