Anant Ambani | పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త జంట అనంత్ అంబానీ (Anant Ambani) – రాధికా మర్చెంట్ (Radhika Merchant) మెరిశారు. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం అక్కడ అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన స్వదేశ్ సెంటర్‌ను కూడా సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
అనంత్ – రాధికల వివాహం ఈ నెల 12వ తేదీన అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజులపాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక వివాహ కార్యక్రమాలను ముగించుకొని అంబానీ ఫ్యామిలీ పారిస్ వెళ్లారు. నీతా అంబానీ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు సహా వారి కుమార్తె ఈషా అంబానీ, కొత్త జంట అనంత్ – రాధికలు పారిస్‌లోనే ఉంటున్నారు. ఒలింపిక్స్ క్రీడలను గ్యాలరీలో కూర్చొని వీక్షిస్తున్నారు.
మరోవైపు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థకు చెందిన స్వదేశ్ సెంటర్‌ను అంబానీ ఫ్యామిలీ ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న ఇండియా హౌజ్ (India house in Paris) వద్ద దీన్ని శనివారం నీతా అంబానీ ఓపెన్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిపి రిలయన్స్ ఫౌండేషన్ .. ఇండియా హౌజ్ కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు. ఆ స్టోర్‌కు చెందిన వీడియోను నీతా అంబానీ రిలీజ్ చేశారు. ఇండియా హౌజ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వదేశ్ పెవిలియన్ వీడియోను పోస్టు చేశారు. నీతా అంబానీ ఆ సెంటర్‌ను వివరించారు.
Also Read..
Ladakh: వేడెక్కుతున్న లడాఖ్.. వేగంగా కరుగుతున్న గ్లేసియర్స్
Preeti Sudan: యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదన్
Manipur Governor | మణిపూర్ గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం.. Video