Preeti Sudan: యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదన్
Preeti Sudan: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమీషన్లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
1983 batch IAS officer and former Union Health Secretary Preeti Sudan will be the new UPSC Chairperson: Preeti Sudan confirms to ANI
(File photo) pic.twitter.com/FmyXZZ2U0m
— ANI (@ANI) July 31, 2024
1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఏపీ క్యాడర్‌కు చెందిన ఆమె.. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబూషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా, మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ శాఖల్లో కార్యదర్శిగా చేశారు. ఆర్థికశాస్త్రంలో ఆమె ఎంఫిల్ చేశారు. సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఎంఎస్సీ చదివారు. రెండు కీలకమైన కేంద్ర పథకాలను ఆమె రూపకల్పన చేశారు. బేటీ బచావో, బేటీ పడావోతో పాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లకు తుదిరూపు ఇచ్చింది ఈమే. నేషనల్ మెడికల్ కమీషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కమీషన్, ఈ-సిగరెట్ల నిషేధంపై చట్టాలను రూపొందించారు.
వరల్డ్ బ్యాంకు వద్ద కన్సల్టెంట్‌గా చేసినట్లు యూపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నది. కాప్-8 సమావేశంలో టొబాకో కంట్రోల్ నియామావళిని రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ ఓ కమిటీ సభ్యురాలిగా చేశారు. ప్రీతి సుదన్ యూపీఎస్సీలో సభ్యురాలిగా 2022లో ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ చైర్మెన్ మనోజ్ సోనీ ఆమె చేత ప్రమాణం చేయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

