Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి (LNJP Hospital)లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది.
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సాయంత్రం 7 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. మరో 20 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగతావారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
STORY | Red Fort blast: Death toll rises to 13 as another injured succumbs at LNJP Hospital
The death toll in the blast near Red Fort early this week rose to 13 after another injured person succumbed to his injuries at the LNJP Hospital here, an official said. The deceased has… pic.twitter.com/I9aTVTO2f6
— Press Trust of India (@PTI_News) November 13, 2025
Also Read..
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్రవాద దాడే : అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో
Delhi Blast Case | సరిపోలిన డీఎన్ఏ.. ఆ కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబీయేనని నిర్ధారణ