e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home జాతీయం 11.8% పెరిగిన సైబర్‌ నేరాలు

11.8% పెరిగిన సైబర్‌ నేరాలు

  • 2020లో దేశంలో 50 వేల కేసులు
  • వీటిలో 60.2 % సైబర్‌ మోసాలే
  • అన్ని నేరాల్లో 28శాతం పెరుగుదల
  • గుజరాత్‌లో అత్యధిక క్రైం రేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ దేశంలో సైబర్‌నేరాలు పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైం రికా ర్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2020 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019తో పోలిస్తే సైబర్‌నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయని పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదలచేసిన ఈ నివేదిక ప్రకారం 2019లో 44,735 నమోదు కాగా, 2020లో 50,035 నమోదయ్యాయి. 60.2% సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసులే ఉన్నాయి. రెండోస్థానంలో లైంగిక వేధింపులు (6.6%), మరో 2,440 కేసులో బెదిరింపులకు సం బంధించినవి ఉన్నాయి. మానవ అక్రమ రవాణాకేసులు 2019తో పోలిస్తే 22% తగ్గుదల నమోదైంది. 2019లో మానవ అక్రమ రవాణా కేసులు 2,208 కేసులు నమోదు కాగా, 2020లో 1,714 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 66,01,285 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ సెక్షన్ల కింద 42,54,356 కేసులు, ఇతర సెక్షన్ల కింద 23,46,929 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో నేరాల నమోదు శాతంలో 28 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మహిళలపై నేరాలు స్వల్పంగా తగ్గాయి. 2019 లో 4,05,326 నేరాలు నమోదుకాగా, 2020కి వచ్చేప్పటికి 8.3% తగ్గుదలతో 3,71,503 నమోదయ్యాయి. చిన్నారులపై 2019లో 1,48,090, 2020లో 1,28,531 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో కలిపి 68,14,614 మందిని 2020లో అరెస్టు చేసినట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా క్రైంరేట్‌ గుజరాత్‌లో ఉన్నది. తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉన్నాయి. నగరాలపరంగా చూస్తే సూరత్‌, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌లు అత్యధిక క్రైంరేట్‌ ఉన్న జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇలా
తెలంగాణలో అన్నిరకాల నేరాలు కలిపి 2020 1,47,504 నేరాలు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే ఇది చాలా స్వల్ప పెరుగుదల. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019లో 18,394 కేసులు వస్తే 2020లో 17,791కి తగ్గాయి. హైదరాబాద్‌లో మహిళలపై పాల్పడిన నేరాల సంఖ్య 2,755 నుంచి 2,390కి తగ్గాయి. పిల్లలపై నేరాలు 4,212 నుంచి 4,200 కు కేసులు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 506 నుంచి 467కు తగ్గింది. 1352 నుంచి 1013కు తగ్గాయి. హైదరాబాద్‌లో 350 నుంచి 172కు కేసులు తగ్గాయి. హత్యల విషయానికి వస్తే దేశం లో 2019లో 28,194 మర్డర్‌లు అవగా, 2020లో 28,493కు పెరుగగా. తెలంగాణలో మాత్రం 839 నుంచి 802కు తగ్గాయి. హైదరాబాద్‌లో 86 నుంచి 71కి మర్డర్‌ కేసులు తగ్గాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana