Rahul Gandhi | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులను ఆదేశించింది. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. మనం రోజు రోజుకూ సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదు. వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదు. ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
The SC’s directive to remove all stray dogs from Delhi-NCR is a step back from decades of humane, science-backed policy.
These voiceless souls are not “problems” to be erased.
Shelters, sterilisation, vaccination & community care can keep streets safe – without cruelty.Blanket…
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2025
వీధి కుక్కలు కనిపించకూడదు
వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5,000 వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలకు అవరోధాలు కల్పించడానికి వ్యక్తులు కాని, సంస్థలు కాని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Also Read..
Cargo Plane | కార్గో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు