Cargo Plane | చెన్నై (Chennai) లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మలేషియా కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ కార్గో ఫ్లైట్ (Cargo Plane) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వేపై ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు (planes engine) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ అధికారులకు అలర్ట్ ఇచ్చారు. అయితే, విమానం సేఫ్‌గానే ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ అలర్ట్‌తో అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Tiranga Rally: జమ్మూకశ్మీర్‌లో 1508 మీటర్ల పొడువైన జాతీయ జెండాతో ర్యాలీ.. వీడియో
Asim Munir: ఆసిమ్ మునీర్.. సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్