దోడా: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో సోమవారం తిరంగా ర్యాలీ(Tiranga Rally) నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుమారు 1508 మీటర్ల పొడువైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ భారీ త్రివర్ణ పతాకంతో .. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరంగా ర్యాలీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోడా జిల్లా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్ నేతృత్వంలో మెగా తిరంగా ర్యాలీ జరిగింది. జాతీయ జెండాను ప్రదర్శించిన విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు.
వెల్కమ్ దోడా ఎంట్రీ గేటు నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఈ తిరంగా ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు తమ స్పూర్తిని, ఐకమత్యాన్ని చాటారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు. దేశభక్తికి చెందిన గీతాలు పాడారు, నినాదాలు చేశారు. జిల్లాలోని ఇతర పట్టణాల్లో కూడా ర్యాలీ చేపట్టారు.
#WATCH | Jammu and Kashmir: A 1508-metre-long national flag was displayed in Doda during the Tiranga rally yesterday.
(Source: District Administration Doda) pic.twitter.com/Cx0rSPTYhS
— ANI (@ANI) August 12, 2025