పెంటగాన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Asim Munir)ను.. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. యుద్ధ కాంక్షతో ఉన్న పాకిస్థాన్ ఓ దుష్ట దేశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమెరికాలో సెప్టెంబర్ లెవన్ దాడులకు కారణమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తరహాలో.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు.
తాజాగా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోయే దశలో ఉంటే. అప్పుడు తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని అణు హెచ్చరికలు చేశారు. ఫ్లోరిడాలోని థంపాలో జరిగిన అమెరికా మిలిటరీ అధికారుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి స్పందించారు. అమెరికా నేలపై పాకిస్థాన్ చేసిన బెదిరింపులు అమోదయోగ్యం కాదు అని రూబిన్ వెల్లడించారు.
సమస్యాత్మక కోణంలో ఉగ్రవాదాన్ని అమెరికా చూస్తుందని, అనేక మంది ఉగ్రవాదుల ఐడియాలజీ అర్థం కాదు అని, సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు ఆసిమ్ మునీర్ అని ఆయన అన్నారు. ఇస్లామిక్ స్టేట్ వ్యాఖ్యల తరహాలో ఫీల్డ్ మార్షల్ ప్రకటన ఉన్నట్లు రూబిన్ తెలిపారు. పాకిస్థాన్‌లో ఉన్న అణ్వాయుధ కేంద్రాలను అమెరికా సీల్ దళాలు స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. పాకిస్థాన్‌ను నాన్-నాటో సభ్య దేశంగా చూడాలని, యూఎస్ సెంట్రల్ కమాండ్ సభ్యదేశంగా చూడవద్దు అని రూబిన్ అన్నారు. ఆసిమ్ మునీర్‌కు ఎప్పటికీ యూఎస్ వీసా ఇవ్వకూడదన్నారు.
#WATCH | Washington DC, USA | On upcoming meeting between US and Russia, Former Pentagon official Michael Rubin says, “…Asim Munir is Osama Bin Laden in a suit…”
He says, “Donald Trump is a businessman and is used to horse-trading… He does not understand that a bad peace… pic.twitter.com/Cra1y24e19
— ANI (@ANI) August 12, 2025