Crime news : స్నేహితుడికి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ వ్యక్తి బంగారు నగలతో పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని పహర్గంజ్ (Paharganj) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్సర్కు చెందిన పర్దీప్ కుమార్ (Pardeep Kumar), ప్రభ్ సింగ్ (Prabh Singh) అనే ఇద్దరు స్నేహితులు ఈ నెల 8న రాత్రి పహర్గంజ్లోని ఓ హోటల్లో బసచేశారు.
ఈ సందర్భంగా పర్దీప్ కుమార్కు ప్రభ్సింగ్ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత అతడి దగ్గరున్న 1.340 కిలోల నగలతో పారిపోయాడు. బాధితుడు 10 రోజులు వేచిచూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.