Ashada Bonalu | మెట్పల్లి : మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శుక్రవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని వండి బోనం ఎత్తుకొని తప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని తమ కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కాగా పలువురు ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా పలు సంఘాల సభ్యులు వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.