Corona Virus | కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత ఏడాది కాలంగా సైలెంట్‌గా ఉన్న వైరస్.. ఒక్కసారిగా కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారత్‌లోనూ కొవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 498 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో ఈ ఏడాది ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ కొత్తగా 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,364కు పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,679 కేసులు వెలుగు చూడగా.. గుజరాత్లో 615, పశ్చిమ బెంగాల్లో 596, ఢిల్లీలో 592, మహారాష్ట్రలో 548, కర్ణాటకలో 451 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో నాలుగు మరణాలు సంభవించాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 55కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 4724 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Also Read..
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సిటీ కమిషనర్, నలుగురు పోలీసు అధికారులపై వేటు