బెంగుళూరు : బెంగుళూరు (Bengaluru)సిటీ పోలీసు కొత్త కమీషనర్‌గా ఐపీఎస్ ఆఫీసర్ సీమంత్ కుమార్ సింగ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. టీవీ రిపోర్టర్లతో మాట్లాడుతూ పూర్వ కమీషనర్ల తరహాలో తాను పనిచేయనున్నట్లు చెప్పారు. ఐపీఎల్ విజేత ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 60 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు కమీషనర్ బీ దయానందను సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో సీమంత్ కుమార్ పేరును ప్రభుత్వం ప్రకటించింది. దయానంద్‌తో పాటు అదనపు కమీషనర్ వికాశ్ కుమార్ వికాశ్, డిప్యూటీ కమీషనర్ శేఖర్ హెచ్‌టీ, అసిస్టెండ్ కమీషనర్ బాలకృష్ణ, కబ్బాన్ పార్క్ ఇన్స్పెక్టర్ గిరీశ్ ఏకే కూడా సస్పెండ్ అయ్యారు.
తొక్కిసలాగ ఘటనలో ఆర్సీబీ, కర్నాకట క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేశారు. అయితే కెంపగౌడ విమానాశ్రయం వద్ద ఇవాళ ఆర్సీబీతో లింకున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ అధికారి నిఖిల్ సోసేల్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని ఉదయం 6.40 గంటలకు విమానాశ్రయం వద్ద అదపులోకి తీసుకున్నారు.ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏకు చెందిన సునిల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌ను కూడా అరెస్టు చేశారు. ఐపీఎల్ ఈవెంట్లను సునిల్ మాథ్యూ ఆర్గనైజ్ చేస్తుంటాడు. అతను డీఎన్ఏ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు.