మాస్కు ధరించని క్రికెటర్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
మాస్కు ధరించని క్రికెటర్ | కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఓ గల్లీ క్రికెటర్‌పై ముంబై సెషన్స్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రికెటర్

ముంబై : కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఓ గల్లీ క్రికెటర్‌పై ముంబై సెషన్స్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రికెటర్ మాస్కు ధరించకపోవడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. మహారాష్ర్టలో కరోనా కేసులు తీవ్రమవుతున్న క్రమంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఖురేషి అనే యువకుడు కొంతమంది మైనర్లతో కలిసి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు. ఆ యువకులు కనీసం మాస్కు కూడా ధరించలేదు. అటుగా పోలీసులు వచ్చేసరికి భయపడి ఆ పిల్లలు పారిపోయారు. కానీ మొబైల్స్ మాత్రం మరిచిపోయారు.
దీంతో ఓ పోలీసు ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. యువకుడు ఖురేషి.. ఓ మైనర్‌తో పోలీసుల వద్దకు వచ్చాడు. మొబైల్‌ను దొంగిలించేందుకు మైనర్ యత్నించడంతో.. పోలీసుకు గాయాలయ్యాయి. మొత్తానికి ఈ కథ కోర్టుకు చేరింది. ఖురేషితో పాటు మిగతా యువకులు మాస్కు ధరించకుండా, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి క్రికెట్ ఆడటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మైనర్‌ను వారి తల్లిదండ్రులకు అప్పగించగా, ఖురేషికి మాత్రం జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది.
ఇవికూడా చదవండి..
ఢిల్లీలో మరోవారం లాక్డౌన్ పొడిగింపు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

