Covid-19 Study | కరోనా మహమ్మారి 2019 సంవత్సరంలో చైనాలో వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కొంతకాలంగా సైలెంట్ అయిన వైరస్.. ఇటీవల మళ్లీ విరుచుకుపడుతున్నది. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు అధ్యయనాలు కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధులకు కారణమైనప్పటికీ.. శరీరంలోని అనేక భాగాలపై దుష్ప్రభావం కలిగిస్తుందని తెలిపాయి. కరోనావైరస్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు నిర్వహించారు. ఇటీవలి ఓ అధ్యయనంలో కొవిడ్‌తో గుండె సంబంధిత సమస్యలతో మరణాలు వేగంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు, కార్డియాకరెస్ట్ కేసులు పెరిగాయని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Read Also : కొవిడ్ కొత్త కోడ్ ఏంటి..?
వైరస్ వెలుగులోకి వచ్చాక గుండె సంబంధిత మరణాలు పెరిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మసాచుసెట్స్‌లో మరణించిన దాదాపు 1.28లక్షల మంది మరణ ధ్రువీకరణపత్రాల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించి హెచ్చరికలు జారీ చేశారు. మహమ్మారి నుంచి 2020 నుంచి 2023 మధ్య గుండె సంబంధిత మరణాల రేటు గణనీయంగా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్, రీసెర్చ్ డైరెక్టర్ జాసన్ హెచ్ వాస్ఫీ మాట్లాడుతూ కరోనా ఇన్ఫెక్షన్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని గత అధ్యయనాలు స్పష్టం చేశాయన్నారు. వైరస్ ప్రారంభం నుంచి గుండెపోటు, కార్డియాకరెస్ట్తో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామన్నారు. మయోకార్డియల్ ఇన్ఫారక్షన్తో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 20-34శాతం తగ్గిందని ఆసుపత్రి డేటా చూపిస్తుందని, అయితే గుండెపోటు మరణాలు పెరిగాయని.. మహమ్మారి సమయంలో ఇతర ఆరోగ్య సేవల్లో లోపాన్ని హైలెట్ చేస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
Read Also : ఆందోళన.. అనారోగ్యం!
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ నివేదిక కోవిడ్-19 బాధిత వ్యక్తులు భవిష్యత్‌లో మూడేళ్ల తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణాలు సంభవించే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. లాస్ ఏంజిల్స్‌లోని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ హూమన్ అల్లే మాట్లాడుతూ.. పాజిటివ్ పరీక్షించినప్పటికీ తీవ్రమైన లక్షణాలు కనిపించని వారికి కూడా హృదయ సంబంధ సమస్యల ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. కరోనావైరస్ కొంతమంది వ్యక్తులకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Also : మట్టి తింటున్నాడు ; ప్రమాదమా?
కరోనా ఇన్ఫెక్షన్ మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంపై అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గర్భదారణకు ముందు, గర్భదారణ సమయంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ సంభవిస్తే.. గర్భం దాల్చిన 20వ వారానికి ముందు గర్భస్రావం అయ్యే ప్రమాదం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. గర్భధారణ సమయంలో కరోనా ఇన్ఫెక్షన్ గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయని అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మైకేలా సాండోవల్ చెప్పారు. ఈ క్రమంలో మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.