National
- Dec 26, 2020 , 21:52:47
మహారాష్ట్రలో ఆగని కరోనా మరణ మృదంగం

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్నది. ప్రతి రోజు 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,854 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,16,236కు, మరణాల సంఖ్య 50 వేలకుపైగా పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 1,526 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,07,824కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,091 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
తాజావార్తలు
- రీమేక్‌పైనే ఇస్మార్ట్ బ్యూటీ ఆశలు..!
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
- చెన్నై దవాఖాన నుంచి కమల్ డిశ్చార్జి
- సూర్య-బోయపాటి కాంబోలో సినిమా..!
- బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
MOST READ
TRENDING