Air India Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికపై బోయింగ్ (Boeing) సంస్థ స్పందించింది. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.
అంతేకాదు బాధితులకు అండగా ఉంటామని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా విమానం-171 ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బంది చుట్టూనే మా ఆలోచనలు తిరుగుతున్నాయి. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్ ప్రకారం.. ఏఐ-171కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు బోయింగ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది.
ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. పక్షి ఢీకొన్న (Bird Hit) ఆనవాళ్లు కూడా కన్పించలేదని నివేదికలో తెలిపింది. ‘విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంలో పక్షులు ఎగరలేదు. పక్షి ఢీ కొన్న ఆనవాళ్లు కూడా గుర్తించలేదు. వాతావరణ సంబంధిత సమస్యలు కూడా లేవు. ఆకాశం కూడా క్లియర్‌గా ఉంది. విజిబిలిటీ బాగుంది. గాలి స్వల్పంగా వీస్తోంది’ అని తెలిపింది. అంతేకాదు, ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. విమానంపై దాడి జరిగినట్లు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని వివరించింది.
Also Read..
Air India Plane Crash | పక్షి ఢీ కొనలేదు.. కుట్ర కోణం లేదు.. ప్రాథమిక నివేదికలో వెల్లడి
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై 15 పేజీల రిపోర్టు.. ఆ నివేదికలో ఇవే కీ పాయింట్స్