న్యూఢిల్లీ: అహ్మాదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన(Ahmedabad Plane Crash) ఘటనలో 241 మంది ప్రయాణికులతో పాటు మొత్తం 270 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదిక 15 పేజీలు ఉన్నది. ఆ ప్రమాదానికి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు ఇవే..
విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత క్షణాల్లోనే రెండు ఇంజిన్లు షట్‌డౌన్ అయ్యాయి. ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్‌లు.. రన్ నుంచి కటాఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అది కేవలం సెకన్లోనే జరిగింది. విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు రిపోర్టులో వెల్లడించారు.
కాక్‌పిట్ ఆడియో సంభాషణ రిలీజ్ చేశారు. ఫ్యూయల్‌ను ఎందుకు కటాఫ్ చేశావని ఓ పైలట్‌ను మరో పైలట్ అడిగాడు. తానేమీ కట్ చేయలేదని ఆ పైలట్ సమాధానం ఇచ్చాడు.
ఇంజిన్లకు పవర్ సప్లయ్ ఆగిపోవడంతో.. రామ్ ఎయిర్ టర్బైన్.. ఓ చిన్నపాటి ప్రొపెల్లర్ లాంటి డివైస్‌ను ఆన్ చేశారు.ఆటోమెటిక్‌గా ఆ డివైస్ హైడ్రాలిక్ పవర్‌ను సరఫరా చేస్తున్నది. ఏఏఐబీ సేకరించిన సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా.. ఆర్ఏటీ వినియోగించినట్లు తెలుస్తోంది.
ఇంజిన్లను రిస్టార్ట్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించారు. ఎన్1 లేదా ఇంజిన్ 1.. పాక్షికంగా రికవరీ అయ్యింది. కానీ కూలడానికి ముందు ఇంజిన్ 2 మాత్రం రికవరీ కాలేకపోయినట్లు రిపోర్టులో తేలింది.
కేవలం 32 సెకన్లు మాత్రం విమానం గాలిలో ఎగిరింది. రన్‌వేకు 0.9 ఎన్ఎం దూరంలో విమానం కూలి ఓ హాస్టల్‌పై పడింది.
త్రస్ట్ లివర్స్ ఐడిల్‌గా ఉన్నట్లు గుర్తించారు. కానీ టేకాఫ్ సమయంలో త్రస్ట్ ఆన్‌లో ఉన్నట్లు బ్లాక్‌బాక్సు ద్వారా తెలుస్తోందన్నారు.
టేకాఫ్ సమయంలో ఫ్లాప్ సెట్టింగ్(5 డిగ్రీలు), రియర్(డౌన్) సాధారణంగా ఉన్నట్లు తేల్చారు. పక్షి ఢీకొట్టడం కానీ.. వాతావరణ సంబంధిత సమస్యలు లేవన్నారు. ఆకాశం కూడా క్లియర్‌గా ఉంది. విజిబులిటీ బాగుంది. గాలి స్వల్పంగా వీస్తుంది.
ఏఏఐబీ రిపోర్టు ప్రకారం .. పైలెట్ల ట్రాక్ రికార్డు కూడా క్లియర్‌గా ఉందని తెలిపారు. ఇద్దరూ మెడికల్‌గా ఫిట్ ఉన్నారు. కావాల్సినంత అనుభవం ఉంది.
విమానంపై దాడి జరిగినట్లు ఆధారాలు లేవు. ఫ్యూయల్ స్విచ్‌లో లోపాలు ఉన్నట్లు ఎఫ్ఏఏ అడ్వైజరీ ద్వారా తెలుస్తోంది. ఎయిర్ ఇండియా రెగ్యులర్ ఇన్స్పెక్లన్లు చేయలేదు. విమానం బరువు, బ్యాలెన్స్ పరిమితులకు తగినట్లే ఉంది. ప్రమాదకరమైన వస్తువులు కూడా దాంట్లో లేవు.