Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లోక్సభలో (Lok Sabha) శుక్రవారం ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత చర్చ ప్రారంభం (Constitution Debate) కానుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించనున్నారు. శనివారం వరకూ ఈ చర్చ కొనసాగుతుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు సమాధానం ఇవ్వనున్నారు.
అదేవిధంగా ఎగువసభ అయిన రాజ్యసభలోనూ రెండు రోజుల పాటు రాజ్యాంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎగువ సభలో చర్చ ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం చర్చను ప్రారంభిస్తారు. 17వ తేదీన అంటే మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై ప్రసంగిస్తారు.
Also Read..
Bomb Threats | వారంలో రెండో సారి.. 16 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
IndiGo Passengers: ఇస్తాంబుల్లో చిక్కుకున్న 400 మంది ఇండిగో ప్రయాణికులు
Supreme Court | మనోవర్తికి అష్ట సూత్రాలు.. విడాకుల కేసులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు