Supreme Court | న్యూఢిల్లీ: విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన మనోవర్తికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మనోవర్తిని నిర్ణయించేందుకు ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వీ వరాలే ధర్మాసనం బుధవారం ఈ తీర్పు చెప్పింది.
అంజు జైన్‌కు రూ.5 కోట్ల భరణాన్ని చెల్లించాలని ప్రవీణ్ కుమార్ జైన్‌కు ఆదేశించింది. విడాకుల కేసులో భార్య, ఆమె బంధువులు, న్యాయమూర్తి వేధిస్తున్నారని ఆరోపిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు విడాకుల కేసుల్లో కీలకంగా మారనుంది.