రాంచీ : జార్ఖండ్‌లోని హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక పెద్ద హోటళ్లపై దాడి చేసిన స్పెషల్ సెల్ పోలీసులు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతోపాటు భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన బెర్మో ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ సింగ్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో హేమంత్ సోరేన్ జేఎంఎం ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని ఎమ్మెల్యే జైమంగల్ సింగ్ రెండు రోజుల క్రితం కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు.
జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంతో హోటల్లో ఉంటున్నారని స్పెషల్ బ్రాంచ్ పేర్కొన్నది. గురు, శుక్రవారాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నగరంలోని పెద్ద హోటళ్లపై నిఘాపెట్టింది. చివరకు లోవర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పెద్ద హోటల్ నుంచి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.
శనివారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులపై కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఒకరిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు తెలుస్తున్నది. అభిషేక్ దూబే, అమిత్ సింగ్, నివారన్ ప్రసాద్ మహతోలపై కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పీసీ చట్టంలోని 8/9 సెక్షన్లతో పాటు 419, 420 124-ఏ, 120 బీ, ఐపీసీలోని 34, పీఆర్ చట్టంలోని 171 సెక్షన్లను విధించారు. సోరేన్ ప్రభుత్వాన్ని కూల్చే వెనుక ఒక పెద్ద వ్యాపారి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులను లోతుగా విచారిస్తే అసలు కుట్ర బయటపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
తాలిబాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న తజికిస్తాన్..!
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్ హామీ
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..