e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్‌ ఇది

చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్‌ ఇది

ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ 1991 లో సరిగ్గా ఇదే రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశనే మార్చింది. లైసెన్స్ రాజ్ సరళీకరణతో ముగిసింది. 1991 లో పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే.. తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతను మన్మోహన్ సింగ్‌కు అప్పగించారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మన్మోహన్‌సింగ్‌ భుజాలపై దుర్భర స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచే బాధ్యతను ఉంచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పెద్ద మార్పులు తీసుకురావడానికి మన్మోహన్‌సింగ్‌కు పీవీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. 1991 లో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆయన తొలి బడ్జెట్‌ను గేమ్ ఛేంజర్ బడ్జెట్ అని పిలుస్తారు.

దిగుమతి-ఎగుమతి విధానాన్ని మార్చడం ద్వారా మన్మోహన్‌సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచారు. ఈ బడ్జెట్ కారణంగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నది. దేశంలో ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేయబడింది. దీనికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థ అనేక కారణాల వల్ల వెనుకబడి ఉన్నది. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, చైనా, పాకిస్తాన్‌తో యుద్ధాలు, దిగుమతుల కోసం సంక్లిష్టమైన లైసెన్సింగ్ వ్యవస్థలు, విదేశీ మూలధన పెట్టుబడులపై ప్రభుత్వ ఆంక్షలు వంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిలిపివేశాయి.

- Advertisement -

మన్మోహన్ సింగ్ సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. దాంతో పాటు దిగుమతి-ఎగుమతి విధానంలో మార్పులు చేశారు. దిగుమతి లైసెన్స్ ఫీజు తగ్గించి, ఎగుమతులను ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకున్నారు. కస్టమ్ డ్యూటీ 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గింది. బ్యాంకులపై ఆర్‌బీఐ నియంత్రణను తగ్గించారు. డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేటు, రుణ మొత్తాన్ని నిర్ణయించే అధికారం బ్యాంకులకు ఇచ్చారు. దేశంలో బ్యాంకుల విస్తరణకు దారితీసేలీ ప్రైవేట్ బ్యాంకులు ప్రారంభించేందుకు నిబంధనలను సడలించారు. లైసెన్స్ రాజ్‌ను రద్దు చేసింది. దాదాపు 18 పరిశ్రమలు మినహా అందరికీ లైసెన్స్ అవసరాన్ని తొలగించారు. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్‌తో నేరుగా భారతీయ పరిశ్రమలకు పోటీకి తలుపులు తెరిచాయి. ఈ సంస్కరణల ఫలితంగా మరుసటి దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

  • 2000: చెస్ క్రీడాంశంలో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన ఎస్ విజయలక్ష్మి
  • 1993: ప్రపంచంలో మొట్టమొదటి ఊపిరితిత్తుల తొలగింపు ఆపరేషన్ చేపట్టిన మేరీల్యాండ్ వైద్యుడు విలియం రీన్హాఫ్
  • 1992: భారత 9 వ రాష్ట్రపతిగా ఎన్నికైన శంకర్ దయాల్ శర్మ
  • 1985: పంజాబ్ సమస్యను పరిష్కరించేందుకు లాంగోవాల్‌తో ఒప్పందం చేసుకున్న రాజీవ్‌గాంధీ
  • 1969: చంద్రుడి ఉపరితలంపై కాలిడి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
  • 1938: మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండ్‌ మార్కెట్‌లో ఇన్‌స్టంట్‌ కాఫీని ప్రవేశపెట్టిన నెస్‌కెఫె
  • 1915: చికాగోలో ప్రయాణికుల నౌక ఎస్ఎస్ ఈస్ట్‌లైనర్ మునిగి 800 మంది దుర్మరణం

ఇవి కూడా చ‌ద‌వండి..

పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్‌..

ఈ శాండ్‌విచ్‌ చాలా కాస్లీ గురూ!

న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana