Rajivgandhi Statue | ఖమ్మంలో అధికారులు దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించారు. ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డున గల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు నిరసన తెలిపారు.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం దారుణమని, తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థానంలో పునఃప్రతిష్ఠించాలని స్థానిక నేతలతో కలిసి వీహెచ్ హనుమంతరావు డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు నేతృత్వం వహిస్తున్న ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించడం, ఆ విగ్రహాన్ని తొలగింపునకు వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆందోళన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి