హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ-మెట్రో రైల్ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రారంభించారు. వన్ డే పాస్ నుంచి వన్ మంత్ పాస్ వరకు ఉపయోగించుకునేలా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు. తాను, రాష్ట్ర మంత్రులంతా రూ.500 చెల్లించి వన్ డే పాస్‌లు కొనుగోలు చేశామని చెప్పారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థలో ఆటో రంగాన్ని కూడా కీలక భాగస్వామిగా గుర్తిస్తూ ఆటో రిక్షా చార్జీలను సవరించామని తెలిపారు. మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జి రూ.30 కాగా.. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 యాడ్ అవుతాయని చెప్పారు. కాగా ఆర్టీసీ-మెట్రో రోజువారీ పాస్ ధర రూ.400 (మెట్రో రూ.300 + ఆర్టీసీ రూ.100), నెలవారీ పాస్ రూ.8,500గా (మెట్రో రూ.7,000 + ఆర్టీసీ రూ.1,500) నిర్ణయించారు.